ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత
- December 11, 2022
చెన్నై: డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆసుపత్రికి చేరకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
దీంతో తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. అయితే శరత్ కుమార్ కు డిసెంబర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయన భార్య ప్రముఖ నటి రాధిక ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని..అయినా కాని మంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు.
ఇదే విషయాన్నిఆయన కుమార్తె వరలక్ష్మీ కూడా ప్రకటించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. అయితే ఇవాళ మళ్లీ శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆసుపత్రి వారు విడుదల చేసే హెల్త్ బులెటిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం
- బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్‌లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!









