షార్జా ఎడారి థియేటర్ ఫెస్టివల్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

- December 12, 2022 , by Maagulf
షార్జా ఎడారి థియేటర్ ఫెస్టివల్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

షార్జా: షార్జా ఎడారి థియేటర్ ఫెస్టివల్ ఆరవ ఎడిషన్ కార్యకలాపాలను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. అల్ కిహైఫ్ ప్రాంతంలో డిసెంబరు 13 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.  ఈ సందర్భంగా ప్రదర్శించిన సుల్తాన్ అల్ నెయాది రచించిన "సలౌమ్ అల్ అరబ్" నాటకానికి మహ్మద్ అల్ అమెరీ దర్శకత్వం వహించారు.  షార్జా నేషనల్ థియేటర్ ట్రూప్ దీన్ని సమర్పించారు. దేశంలోని ప్రముఖ రంగస్థల కళాకారులు చాలా మంది పాల్గొన్నారు. ఈ నాటకం ఎమిరాటీ బెడౌయిన్ వాతావరణాన్ని దాని ఆచారాలు, సంప్రదాయాలతో పాటు ప్రజల దాతృత్వం, ధైర్యం, పరోపకారత గురించి వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని తెలియజెప్పింది.

ఈ ఫెస్టివల్ ఎమిరేట్స్, ఈజిప్ట్, మొరాకో, సిరియా, మౌరిటానియా నుండి రంగస్థల నటులు పలు ప్రదర్శనలను ఇవ్వడానికి విచ్చేశారు. అలాగే అరబ్ దేశాల నుండి డజన్ల కొద్దీ థియేటర్ కళాకారులు దీనికి హాజరు అవుతున్నారు. షార్జా ఫెస్టివల్ ఫర్ ఎడారి థియేటర్ "డెసర్ట్ థియేటర్ అండ్ ది ఆరిజినేషన్ ఆఫ్ అరబ్ స్పెక్టాకిల్" పేరుతో మేధోపరమైన సింపోజియంను కూడా నిర్వహిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com