‘కాంతార’పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.!
- December 12, 2022
ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్న తత్వం రాజమౌళిది. అదే ఆయనను ప్రపంచం కీర్తించదగ్గ డైరెక్టర్ అయ్యేలా చేసింది. రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ సినిమాలే. ఓ మోస్తరు చిన్న సినిమాని రాజమౌళి నుంచి ఊహించగలమా.?
నో ఛాన్స్.! కానీ, చిన్న సినిమాల్ని తనదైన విజన్‌తో ప్రశంసించదగ్గ డిగ్నిటీ ఆయన సొంతం. తాజాగా ‘కాంతార’ సినిమాని వీక్షించిన ఆయన, పెద్ద పెద్ద వసూళ్లు కొల్లగొట్టాలంటే, భారీ బడ్జెట్ సినిమాలే తీయాలని రూల్ లేదు.. అని కాంతార నిరూపించింది అని చెప్పారు.
అలాగే, ఈ సినిమా ఓ ఫిలిం మేకర్‌గా తనను ఆలోచనలో పడేసిందని ఆయన తెలిపారు. అంటే, మినిమమ్ బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’ అనూహ్యమైన వసూళ్లు కొల్లగొట్టడమే రాజమౌళిని ఇలా మాట్లాడేలా చేశాయని అర్ధం చేసుకోవచ్చేమో.
రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ ‘కాంతార’ సినిమాపై ఈ తరహా ప్రశంసలు గుప్పించడం నిజంగా శోచనీయం. దటీజ్ రాజమౌళి. ఆయన రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ దేశ వ్యాప్తంగా 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో పాటూ, ప్రస్తుతం జపాన్‌లోనూ రిలీజ్ అయ్యి, అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







