పర్వతాలలో గల్లంతైన విదేశీ కుటుంబాన్ని రక్షించిన దుబాయ్ పోలీసులు

- December 12, 2022 , by Maagulf
పర్వతాలలో గల్లంతైన విదేశీ కుటుంబాన్ని రక్షించిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: హట్టా పోలీస్ స్టేషన్‌లోని రెస్క్యూ బృందం పర్వతాలలో దారి తప్పిపోయిన ఓ విదేశీ కుటుంబాన్ని రక్షించింది. ఒక విదేశీ కుటుంబం (తల్లిదండ్రులు, వారి నలుగురు పిల్లలు ) నుండి తమకు కాల్ వచ్చిందని, వారు నిర్దేశించిన ట్రెక్కింగ్ ప్రాంతం నుండి దూరంగా వెళ్లినట్లు... తమకు సహాయం చేయాలని కోరినట్లు హట్టా పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా రషీద్ అల్ హఫీత్ చెప్పారు. పోలీసులు వెంటనే డ్రోన్‌లను మోహరించి వారి ఆచూకీని తెలుసుకుని నిమిషాల వ్యవధిలో వారిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు.
పర్వత ప్రాంతాలు, లోయలు లేదా ఇతర ప్రదేశాలలో అయినా అత్యవసర సమయంలో బాధితులను రక్షించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అల్ హఫీత్ తెలిపారు. పర్వతాలు, లోయలు, డ్యామ్‌ల సహజ సౌందర్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హట్టా ప్రాంతానికి వస్తారని, అలాగే వారసత్వ గ్రామాలను, స్థానిక దుకాణాలను కూడా సందర్శించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పర్వతారోహణ సమయంలో నిపుణుల సూచనలు పాటించాలని, సేఫ్టీ ప్రోటోకాల్‌ను అనుసరించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ సెంటర్‌కు 999కి కాల్ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com