బన్నీ ఫ్యాన్స్‌కి అలా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా.?

- December 13, 2022 , by Maagulf
బన్నీ ఫ్యాన్స్‌కి అలా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా.?

బన్నీ నటించిన ‘పుష్ప’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో, ఎప్పుడుప్పుడు ‘పుష్ప 2’ వస్తుందా.? అని బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ సినిమా అంతకంతకూ వెనక్కి వెనక్కి వెళ్లిపోతోంది.
ఉత్త మాటలతో సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారే తప్ప, సినిమా సెట్స్ మీదికి వెళ్లింది లేదింతవరకూ. మొన్న సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కానీ, రెగ్యులర్ షూట్ అప్‌డేట్స్ ఇంకా రాలేదు.
మరోవైపు ‘పుష్ప’ సినిమాతోనే ఇంకా పండగ చేసుకుంటున్నాడు బన్నీ. రష్యాలో రీసెంట్‌గా ‘పుష్ప’ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే, బన్నీ, ఫ్యాన్స్‌కి ఓ సరికొత్త సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడనీ టాక్.
ఓటీటీలో ఓ టాక్ షోతో బన్నీ సందడి చేయబోతున్నాడనేది ఆ టాక్ సారాంశం. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి సీనియర్ హీరోలతో పాటూ, యంగ్ హీరోల్లో ఎన్టీయార్, నాని బుల్లితెరపై హోస్టింగ్‌లో సత్తా చాటారు.
ఇక, బన్నీ కూడా అదే బాటలో తనలోని కొత్త యాంగిల్ బయట పెట్టాలనుకుంటున్నాడట. ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య హోస్ట్‌గా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఇదే ఓటీటీ వేదికగా బన్నీ కూడా ఓ కొత్త టాక్ షోని షురూ చేయాలన్న యోచనలో వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. మరి, ఇదెంతవరకూ నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com