ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న లియోనల్ మెస్సీ...
- December 14, 2022
దోహా: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్, అర్జెంటినా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆయన క్రీడా ప్రపంచానికి వీడ్కోలు పలకబోతున్నట్లు మెస్సీ అధికారికంగా వెల్లడించాడు. తాజా వరల్డ్ కప్‌లో అర్జెంటినా జట్టు క్రొయేషియాపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
సెమీ ఫైనల్లో అర్జెంటినా విజయం సాధించడంలో మెస్సీ పాత్ర కీలకం. ఒక గోల్ సాధించడమే కాకుండా, తన జట్టు తరఫున మరో ఆటగాడు గోల్ సాధించడంలో సాయపడ్డాడు. దీంతో మరోసారి మెస్సీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ అర్జెంటినా స్టార్ ఇక తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి వీడ్కోలు మ్యాచ్ కానుంది. మెస్సీ తన కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. ప్రపంచ కప్‌లలో ఇప్పటివరకు 11 గోల్స్ సాధించాడు. తాజా వరల్డ్ కప్‌లోనే ఐదు గోల్స్ సాధించి బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అర్జెంటినా ఆరు మ్యాచులు ఆడగా, అందులో నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడంటే అతడి ఫామ్ అర్థం చేసుకోవచ్చు.
ఇది మెస్సీ ఆడుతున్న ఐదో వరల్డ్ కప్ కావడం మరో విశేషం. ఈ వరల్డ్ కప్ ద్వారా మెస్సీ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీ ద్వారా ఫుట్‌బాల్ దిగ్గజాలైన డిగో మారడోనా, జేవియర్ మాషెరానో రికార్డును అధిగమించాడు. వారిద్దరూ నాలుగు వరల్డ్ కప్‌లు మాత్రమే ఆడాడు. వరల్డ్ కప్‌లో 25 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా మెస్సీనే. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ, తన జట్టుకు ప్రపంచ కప్ అందించడమే ఒక ఆటగాడికి అత్యుత్తమ విజయం. తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆటగాడు మెస్సీ వరల్డ్ కప్ విజయంతో ఆటకు వీడ్కోలు పలుకుతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్‌లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









