నకిలీ వస్తువులను విక్రయించిన సంస్థకు RO1,000 జరిమానా

- December 14, 2022 , by Maagulf
నకిలీ వస్తువులను విక్రయించిన సంస్థకు RO1,000 జరిమానా

మస్కట్: ధహీరా గవర్నరేట్‌లో నకిలీ వస్తువులను విక్రయించినందుకు వాణిజ్య సంస్థపై RO1,000 పరిపాలనాపరమైన జరిమానా విధించినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) వెల్లడించింది. వివిధ మార్కెట్లు, దుకాణాలు, వాణిజ్య కేంద్రాలలో డిపార్ట్‌మెంట్ నిర్వహించిన తనిఖీ సందర్శనల సందర్భంగా, ధహీరా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం నకిలీ వస్తువులను విక్రయించే వాణిజ్య సంస్థపై దాడి చేసిందని పేర్కొంది.
ఒక వాణిజ్య సంస్థ నకిలీ, మోసపూరిత వస్తువులతో పాటు వివరణాత్మక డేటాను కలిగి లేని వస్తువులను విక్రయించి, ప్రదర్శించినట్లు కనుగొనబడిందని తెలిపింది. దీంతో ఉల్లంఘించిన వస్తువులను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్టం, దాని నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు సంస్థపై RO1,000 పరిపాలనాపరమైన జరిమానా విధించినట్లు సీపీఏ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com