షాపులలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- December 15, 2022
యూఏఈ: ఎమిరేట్‌లోని షాపుల్లోకి చొరబడి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకున్న ఐదుగురు ఆసియన్లతో కూడిన ముఠాను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీఐడీ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ తెలిపారు. వారి నివాసం నుంచి చోరీకి గురైన వస్తువులు మొబైల్ ఫోన్లు, డబ్బు, వాచీలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. అధిక నాణ్యత గల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, దుకాణంలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచకుండా.. విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశాలలో ఉంచడం ద్వారా తమ దుకాణాల్లో చోరీ నివారణ చర్యలను మెరుగుపరుచుకోవాలని వ్యాపార యజమానులను ఆయన కోరారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







