సౌదీలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం
- December 15, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో మెడికల్ సర్క్యులేషన్ నియంత్రణకు లోబడి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, టాబ్లెట్ల అక్రమ రవాణా ప్రయత్నాలను అడ్డుకున్నట్లు బోర్డర్ గార్డ్ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. నజ్రాన్, జజాన్, అసిర్, నార్తర్న్ బోర్డర్ ప్రాంతాల్లో స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ మిస్ఫిర్ అల్-ఖురైనీ తెలిపారు.
ల్యాండ్ పెట్రోలింగ్‌లో 52.4 టన్నుల నార్కోటిక్ ఖాట్, 807 కిలోల నార్కోటిక్ హషీష్, మెడికల్ సర్క్యులేషన్‌కు లోబడి 475,000 కంటే ఎక్కువ మాత్రలు, అలాగే 145,000 కంటే ఎక్కువ నార్కోటిక్ యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆయా కేసుల్లో 421 మంది నిందితులుగా ఉన్నారని, వీరిలో 39 మంది సౌదీ పౌరులు ఉన్నారన్నారు. అలాగే 382 మంది సరిహద్దు భద్రతా వ్యవస్థను ఉల్లంఘించినవారు ఉండగా.. అందులో 342 మంది యెమెన్ పౌరులు, 38 మంది ఇథియోపియన్లు, ఇద్దరు ఇరాకీలు ఉన్నారని కల్నల్ మిస్ఫిర్ అల్-ఖురైనీ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







