కడప దర్గాని దర్శించుకున్న రజనీకాంత్,రెహమాన్
- December 15, 2022 
            కడప: సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీలో సందడి చేస్తున్నారు. ఉదయం తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆయన..మధ్యాహ్నం కడప దర్గాని దర్శించుకున్నారు. కడపలోని అమీన్ పీర్ దర్గాను రజనీకాంత్ తోపాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దర్శించుకున్నారు. అలాగే రజని కూతురు కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సైతం దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అమీన్ పీర్ దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్, రెహమాన్ ల రాకతో ఆయన అభిమానులు భారీగా దర్గా వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
మొదటిసారి దర్గాకు రజనీకాంత్ రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్గా సంప్రదాయం ప్రకారం ఏఆర్ రెహమాన్, రజనీకాంత్ తలపాగ చుట్టారు. దాదాపు రెండు గంటల పాటు రజనీకాంత్, ఏహార్ రెహమాన్ పెద్ద దర్గాలోనే గడిపారు. అనంతరం చెన్నైకి బయలు దేరారు. అంతకుముందు ఉదయం రజనీకాంత్ ఆయన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







