‘ఫెస్టివల్ సీజన్’ ఈవెంట్ల షెడ్యూల్ ప్రకటించిన బహ్రెయిన్
- December 15, 2022
మనామా: బహ్రెయిన్ ఫెస్టివల్ సీజన్ కోసం ఈవెంట్ల షెడ్యూల్‌ను బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. ఎస్టీసీ సహకారంతో "ఫెస్టివల్ సిటీ" డిసెంబర్ 25న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో నాలుగు వారాల పాటు ప్రారంభించబడుతుందని అథారిటీ తెలిపింది. ఈవెంట్ లో భాగంగా లైవ్ షోలు, గేమ్‌లు, మ్యూజిక్, ఎంటర్ టైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయని పేర్కొంది.
బహ్రెయిన్ ఫెస్టివల్ సీజన్లో భాగంగా అల్ డానా యాంఫీథియేటర్ కళాకారులు నబీల్ షుయిల్, ముట్రెఫ్ అల్ముట్రేఫ్లు జాతీయ దినోత్సవ కాన్సర్ట్ లు, డిసెంబర్ 31న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి మార్టిన్ గారిక్స్ ఈవెంట్ తో సహా అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు అథారిటీ తెలిపింది.
జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా బహ్రెయిన్ బే డిసెంబరు 15న మొదటిసారిగా డ్రోన్లు, లైట్ షోను ప్రదర్శిస్తుందని, డిసెంబరు 16న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో బాణసంచా ప్రదర్శన జరుగుతుందని అథారిటీ పేర్కొంది. అవెన్యూస్ పార్క్ లో కూడా నూతన సంవత్సర వేడుకల కోసం బాణాసంచా ప్రదర్శన ఉంటుందని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రిటైలర్లు, ట్రేడ్‌మార్క్‌లను ఒకచోట చేర్చే బహ్రెయిన్ ఆటం ఫెయిర్ డిసెంబర్ 22 నుండి 30 వరకు కొత్త ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో నిర్వహించబడుతుందని అథారిటీ వెల్లడించింది. బహ్రెయిన్ ఫెస్టివల్ సీజన్ క్యాలెండర్ గురించి మరింత సమాచారం కోసం http://calendar.bh వెబ్‌సైట్‌ను లేదా Instagram ఖాతా http://calendar.bhని అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







