స్కూల్ బస్ స్టాప్ ఆర్మ్స్ - కెమెరా
- April 26, 2016
స్కూలు బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు వాటిని ఓవర్టేక్ చేయడం ఇకపై నేరం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఈ మేరకు స్టాప్ ఆర్మ్స్‌పై కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులు బస్సు ఎక్కుతున్నప్పుడు లేదా, దిగుతున్నప్పుడు ఈ స్టాప్ ఆర్మ్ బస్సుకి ఎడమవైపు కనిపిస్తుంది. వెంటనే, వెనకాల వచ్చే వాహనాలు ఆగవలసి ఉంటుంది. ఇది విద్యార్థుల భద్రత కోసం ఏర్పాటు చేయబడిన నిబంధన అయినప్పటికీ, చాలామంది వాహనదారులు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. విద్యార్థుల భద్రత కోసం తీసుకునే చర్య ఇలా ఉండగా, స్కూల్ బస్ ఫీ స్ట్రక్చర్‌ని రెగ్యులేట్ చేయడంపైనా నాలెడ్జ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఆర్టిఏ సమాలోచనలు చేస్తోంది. స్కూలు బస్సుల విషయానికి వస్తే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్, 3 ప్లస్ 2 సిసిటివి కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. 12 సీట్లు కలిగిన మినీ వ్యాన్లను స్కూలు బస్సులుగా ఉపయోగించకుండా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







