డ్రైవర్‌లెస్ కార్‌ని టెస్ట్ డ్రైవ్ చేసిన షేక్ హమాదన్
- April 26, 2016
దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రైవర్‌లెస్ స్మార్ట్ కార్‌ని పరీక్షించి చూశారు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ కారులో 10 నుంచి 12 మంది ప్రయాణీకులు ప్రయాణించడానికి వీలుంటుంది. యుఐటిపి మెనా ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఎగ్జిబిషన్ కాంగ్రెస్ 2016లో ఈ అద్భుతమైన వాహనం చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈ వాహనంలో క్రౌన్ ప్రిన్స్ ప్రయాణించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిబిషన్ హాల్స్‌ని ఈ వాహనంలో తిలకించారాయన. మూడు రోజులపాటు ఈ డ్రైవర్‌లెస్ కారు ప్రదర్శనకు అందుబాటులో ఉంటుందని ఆర్‌టిఏకి చెందిన లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హషీమ్ బెహ్రూజియాన్ చెప్పారు. భవిష్యత్తు పూర్తిగా డ్రైవర్‌లెస్ కార్లదేనని ఆయన అన్నారు. 40 మీటర్ల దూరం నుంచే ముందు వస్తున్న వాహనాల్ని ఈ స్మార్ట్ కార్ గుర్తించి, తదనుగుణంగా తన వేగాన్నీ, దిశనూ మార్చుకుంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







