చైనాతో రగడ నేపథ్యంలో అగ్ని-5 పరీక్షించిన భారత్
- December 15, 2022
న్యూ ఢిల్లీ: చైనాతో సరిహద్దు రగడ నేపథ్యంలో భారత్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ అగ్ని-5 క్షిపణిని గురువారం పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అగ్ని-5 పరీక్షే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణుల్లో అగ్ని-5 ఒకటి. ఈ క్షిపణికి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం కొట్టగల సామర్థ్యం ఉంది. ఈ దూరంతో చైనా భూభాగం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. ఈ క్షిపణిని కనుక ప్రయోగించినట్లైతే చైనాలోని ఏ భాగాన్నైనా లక్ష్యంగా చేసుకోవచ్చు.
వాస్తవానికి ఈ క్షిపణి పాతదే. 2012 సంవత్సరంలోనే మొదటిసారి పరీక్షించారు. అప్పుడే ఇది విజయవంతం అయింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుతం చైనాతో తగాదా నేపథ్యంలో మరోసారి పరీక్షించారు. సూదుర లక్ష్యాలను చేధించే క్షిపణిని పరీక్షించాలనే ఉద్దేశాన్ని భారత్ కొద్ది వారాల క్రితమే ప్రకటించింది. దాని కోసం నోటం లేదా ఎయిర్మెన్లకు నోటీసు జారీ చేసి, ప్రణాళికాబద్ధమైన టెస్ట్-ఫైరింగ్ గురించి హెచ్చరించింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని-5ని భారత వ్యూహాత్మక దళ కమాండ్లో చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







