BEL లో ఉద్యోగాలు...
- December 15, 2022
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్/సీఎస్ఈ/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/సివిల్/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్, టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగిఉండాలి. 2022, 2021, 2022 విద్యాసంవత్సరాల్లో మాత్రమే చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 23, 2022 శుక్రవారం ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.india.gov.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







