షార్జాలో వాహనాల రిజిస్ట్రేషన్.. ఇ-సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభం

- December 17, 2022 , by Maagulf
షార్జాలో వాహనాల రిజిస్ట్రేషన్.. ఇ-సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభం

యూఏఈ: వాహనాల రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న షార్జా పోలీస్ GHQ.. వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇ-సిగ్నేచర్ సేవను ప్రారంభించింది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యుత్తమ సేవలను అందించడానికి షార్జా పోలీసుల వ్యూహంతో కొత్త  సర్వీసును ప్రారంభించినట్లు పేర్కొంది. షార్జా పోలీస్‌లోని వెహికల్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రెహ్మాన్ ఖాటర్ మాట్లాడుతూ.. ఈ సేవ వాహనాల యజమానులు రిజిస్టర్ చేసుకోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఎలక్ట్రానిక్‌గా సంతకం చేయడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. ఈ-సంతకం సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా వాహన యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ, నమోదుకు సంబంధించిన లావాదేవీలను సులభతరం చేస్తుందని లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రెహ్మాన్ ఖాటర్ తెలిపారు. కంపెనీ వాహనాల రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియలో కంపెనీ సభ్యులలో ఒకరు తమ పనులను నిర్వహించడానికి కంపెనీ నుండి ప్రాతినిధ్య లేఖను అందించినట్లయితే, కంపెనీలు కూడా సేవను ఉపయోగించుకోవడానికి అర్హులని ఖాటర్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com