బహ్రెయిన్ లో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు
- December 17, 2022
బహ్రెయిన్: 51వ జాతీయ దినోత్సవాలు బహ్రెయిన్ వ్యాప్తంగా జరిగాయి. రాజు సింహాసనాన్ని అధిరోహించిన 23వ వార్షికోత్సవం, 1783లో అహ్మద్ అల్ ఫతే అరబ్ ముస్లిం దేశంగా బహ్రెయిన్‌ని స్థాపించిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ బహ్రెయిన్‌లోని నలుమూలల వేడుకలు నిర్వహించారు. ప్రపంచ దేశాల నుంచి జాతీయ దినోత్సవాల సందర్భంగా అభినందనలు వెల్లువెత్తాయి. బహ్రెయిన్‌లోని భారత రాయబారి బహ్రెయిన్ జాతీయ దినోత్సవం 2022 సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యంలోని అన్ని గవర్నరేట్లలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు అద్భుతమైన లైటింగులు ఏర్పాటు చేశారు. రిఫాలోని గడియారం రౌండ్అబౌట్, జల్లాక్, ఇసా టౌన్ స్ట్రీట్‌లోని అలంకరించబడిన చెట్లు, వీధిలోని లైట్ కారిడార్లు, బహ్రెయిన్ బే స్ట్రీట్ అలంకరణలు ఆకట్టుకున్నాయి. క్రౌన్ ప్రిన్స్ స్ట్రీట్ నుండి అల్ రిఫా స్ట్రీట్ వరకు 3 కి.మీ దూరం లైట్ స్తంభాలు, ప్రకాశవంతమైన బహ్రెయిన్ జెండాలతో వెలిగిపోయింది.
దేశ ప్రయోజనాలను, పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో అందరూ కలిసి నిలబడాలని షురా కౌన్సిల్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ముహరక్ క్లబ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ అలీ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా పిలుపునిచ్చారు. జాతీయ మానవ హక్కుల సంస్థ చైర్మన్ అలీ అహ్మద్ అల్-దేరాజీ మాట్లాడుతూ.. ప్రజలు వేడుకల ద్వారా రాజ్యం, నాయకత్వం పట్ల తమ ప్రేమ, విధేయతను తెలియజేస్తారని అన్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







