కొత్త జీవితంలోకి మంచు మనోజ్.! ప్రచారం నిజం చేయబోతున్నాడా.?
- December 17, 2022
మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. పర్సనల్ రీజన్స్ కారణంగా వైవాహిక బంధంలో చీలికలు ఏర్పడ్డాయ్. వివాహం చేసుకున్న రెండేళ్లకే మనోజ్ ప్రణతి రెడ్డికి విడాకులిచ్చేశారు.
ఆ తర్వాత సినిమాలకూ దూరమైపోయారు. మొన్నామధ్య ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాని స్టార్ట్ చేశారు. కానీ, మధ్యలోనే ఆపేశారు. తాజాగా కడప దర్గాను దర్శించుకున్న మంచు మనోజ్, తాను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.
అలాగే, ఇకపై వరుసగా సినిమాలు కూడా చేస్తానని తెలిపారు. ఇక మంచు మనోజ్ గత కొంతకాలంగా దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో తనయ మౌనికతో రిలేషన్లో వున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఆమెనే మనోజ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.
బహుశా ఆ ప్రచారాన్ని మనోజ్ నిజం చేయబోతున్నారు కాబోలు. అంతేకాదు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మౌనికతో మనోజ్ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







