గుండేపోటుతోనే అమెరికన్ సాకర్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణం

- December 17, 2022 , by Maagulf
గుండేపోటుతోనే అమెరికన్ సాకర్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణం

దోహా: అమెరికన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ అయోర్టిక్ అనూరిజం (aortic aneurysm) పగిలిపోవడం వల్లే అతడు మరణించాడని, అతని మరణంలో అనుమానాస్పదంగా ఏమీ లేదని గ్రాంట్ వాల్ కొట్టిపారేసింది. డిసెంబర్ 10న ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను కవర్ చేస్తూ గ్రాంట్ వాల్ మరణించిన విషయం తెలిసిందే. గ్రాంట్ వాల్ భార్య, జో బిడెన్ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ సెలిన్ గౌండర్ మీడియాతో మాట్లాడారు. దివంగత జర్నలిస్ట్ మృతదేహం డిసెంబర్ 12న న్యూయార్క్ నగరానికి చేరుకున్నది. అక్కడ అతని మరణానికి కారణాన్ని గుర్తించడానికి మరోసారి శవపరీక్ష నిర్వహించారు. "న్యూయార్క్ సిటీ కరోనర్ కార్యాలయంలో నిర్వహించిన శవపరీక్షలో.. గ్రాంట్ బృహద్ధమని సంబంధ రక్తనాళము చీలికతో మరణించినట్లు తేలింది. గుండె చుట్టూ ఉన్న పొరలో మంట, రక్తస్రావం తీవ్రంగా జరిగింది. అతని మరణం COVID-19కి సంబంధించినది కాదు. అతని మరణంలో అనుమానాస్పదంగా ఏమీ లేదు" అని సెలిన్ గౌండర్ వెల్లడించారు. 49 ఏళ్ల జర్నలిస్ట్ మరణించినప్పటి నుండి అతని మరణంపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. గ్రాంట్ వాల్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక 1996లో స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్‌తో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించాడు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com