బహ్రెయిన్‌లోని పెరిగిన ఈగల బెడద.. నివారణ మార్గాలు
- December 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల దోమల వ్యాప్తితోపాటు హౌస్‌ఫ్లైస్ బెడద ఎక్కువైంది. ఇటీవల తమ ఇళ్లలో ఆగల బెడద అధికం అయిందని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి నివాసాల వద్దే కాకుండా పని చేసే చోట కూడా ఈగలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఈగల సంచారం తమను నిరంతరం ఇబ్బంది పెడుతుందని, ప్రతికూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని వారు బాధపడతుతున్నారు. దోమల సంఖ్యతో పోలిస్తే వందల సంఖ్యలో ఉన్నందున హౌస్ఫ్లైలు ముఖ్యంగా చికాకు కలిగిస్తాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. 'క్రిమిసంహారకాలు లేదా ఇతర నిరోధకాలతో వాటిని అదుపులో ఉంచడం సవాలుగా ఉంది" అని నివాసితులు అంటున్నారు.
ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని పీయూష్ అరుణ్ మాట్లాడుతూ.. ఈ సమస్యను రూట్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (IPM) వ్యవస్థ మాత్రమే మార్గమని అన్నారు. మానవ ఆరోగ్యం, పర్యావరణం, పెంపుడు జంతువులకు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి హౌస్ఫ్లైస్తో సమస్యలను నివారించడం లేదా తగ్గించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటి ఆవరణలో ఈగలు పెరగకుండా.. పునరుత్పత్తి చేయకుండా నిరోధించే పరిస్థితులను కొనసాగించాలన్నారు.
ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఈగలు జీవులలో అత్యంత పరిశుభ్రమైనవి కావని, ఇవి తరచుగా మురుగు కాలువలు, డంప్‌లు, వ్యర్థాల కుప్పలపై సంచరించి కనీసం 65 వ్యాధులను వ్యాపిస్తాయని తెలిపారు. ఈగల కారణంగా టైఫాయిడ్ జ్వరం, విరేచనాలు, కలరా, పోలియోమైలిటిస్, ఆవలు, ఆంత్రాక్స్, తులరేమియా, లెప్రసీ, క్షయ వంటి వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఈగలు ఇంటిలోకి రాకుండా కిటికీలు, తలుపులకు కర్టెన్లు వాడాలని సూచించారు. రిటైల్ స్టోర్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థల ప్రవేశద్వారాల వద్ద ఎయిర్ కర్టెన్లను అమర్చడం వలన ఈగలు ప్రవేశాన్ని నిరోధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈగల నిరోధానికి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే బదులు, అంటుకునే ఉచ్చులు, యూవీ కాంతి ఉచ్చులు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







