ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం

- October 28, 2025 , by Maagulf
ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం

గుంటూరులో నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా అద్భుతమైన చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.2026, జనవరి 3,4,5 తేదీల్లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని వివరించారు.అందులో భాగంగా స్థానిక శ్రీ సత్యసాయి స్పిర్చివల్ సిటీ ప్రాంగణంలో ‘మన అమరావతి’ పేరుతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రదర్శనలో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా వైభవం, ఆంధ్రప్రదేశ్ కీర్తి, పర్యావరణంతోపాటు ప్రకృతి సౌందర్యం తదితర అంశాలను ప్రతిబింబించే "చిత్రకళా కృతులను" ప్రదర్శించేందుకు వర్ధమాన, ప్రముఖ చిత్రకారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రదర్శనలో ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇక ఈ ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ కళాకారునికి ప్రశంసా పత్రంతోపాటు ఈ మహాసభల అభినందన పతకం అందిస్తామని వివరించారు. చిత్రకారులు తమ చిత్రాలను కింద చిరునామాకు 2025, డిసెంబర్ 15వ తేదీ లోపు పంపాల్సి ఉంటుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కింది చిరునామాకు పంపాలని సూచించారు.

చిరునామా:

ఎస్.విజయ్ కుమార్,

సమన్వయకర్త–చిత్ర కళా ప్రదర్శన “మన అమరావతి”

202, సత్యవతి హోమ్స్,

కనకమేడల కన్వెన్షన్ ఎదురుగా,

మెయిన్ రోడ్, ఎస్‌విఎన్ కాలనీ,గుంటూరు 522006

సెల్ నెంబర్ : 9849503860.

నిబంధనలు..

గీసిన చిత్రాలు పరిమాణం: గరిష్ఠం 24” x 30” ఉండాలని,ఏదైనా ఫ్రేమ్ చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలనీ కోరారు. ఇక ఈ ప్రదర్శనలోని ఆయా చిత్రాలు విక్రయం జరిగితే.. వచ్చిన నగదు మొత్తాన్ని నేరుగా ఆయా కళాకారులకు అందజేయ బడుతుందని స్పష్టం చేశారు.

తెలుగు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహత్తర కళా ప్రదర్శనలో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని కార్యదర్శి శ్రీ ధవేజి , ముఖ్య సమన్వయకర్త శ్రీ పి.రామచంద్ర రాజు, సహ సమన్వయకర్త వి.విద్యాసాగర్‌ తెలిపారు.

మరిన్ని వివరాలు కోసం..

డా.గజల్ శ్రీనివాస్

అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్

సెల్ నెంబర్: 9849013697

పి.రామచంద్ర రాజు

ముఖ్య సమన్వయ కర్త

3వ ప్రపంచ తెలుగు మహాసభలు- 2026

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com