హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- October 28, 2025
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారు.
భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. హరీశ్ రావును హత్తుకొని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అదేవిధంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని.. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







