3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- October 28, 2025
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి, మరియు విశ్వవ్యాప్తికి అంకితంగా నిర్వహించబడుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుండి 5వ తేదీ వరకు గుంటూరులోని శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో నందమూరి తారకరామారావు వేదిక పై జరుగనున్నాయి.
దేశ విదేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి తెలుగు ప్రతినిధులు, చలన చిత్ర , సాహితీ, సాంస్కృతిక కళాకారులు, కవి సమ్మేళనాలు, సదస్సులు, హస్త కళల, పుస్తక, చిత్ర కళల ప్రదర్శనలు, ఆధ్యాత్మిక వేదిక. వేలాది మంది యువత తెలుగు సంస్కృతిపై కళా ప్రదర్శనలు జరుగనున్నాయి.
తెలుగు మహా సభలకు మీకు మా హృదయ పూర్వక ఆహ్వానం.మహా సభల మూడు రోజులు మాతో గడపి మాకు స్ఫూర్తిని కలిగించవలసినదిగా ప్రార్థన. మీతో అనుబంధంగా వున్న సంస్థలకు,కవులకు, విద్యార్థులకు కూడా మా సభక్తిక ఆహ్వానాన్ని మీ ద్వారా తెలుపగలరు.
మీ రాక సమాచారాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా మాకు తెలియజేయండి.
మేము మీకు అందించగల సేవలు
- నమోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు
- వసతి నుండి వేదిక ప్రాంగణానికి స్థానిక రవాణా ఏర్పాట్లు
- మోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు
- మహా సభల మూడు రోజులు ఉచిత అల్పాహార, భోజన సదుపాయం.( భోజనం టోకెన్స్ ఇవ్వబడును)
- డార్ మెంటరి వసతి, పరుపు, టాయిలెట్స్ సదుపాయం ఇవ్వబడును.ఎవరి టాయిలెట్ కిట్ వారే తెచ్చుకొనవలెను.(వేడి నీళ్ళ సదుపాయం కుదరదు).
- స్త్రీలకు, పురుషులకు వేరు వేరు డార్ మెంటరీ ల ఏర్పాటు.
- నమోదు చేసుకొని, పాల్గొన్న వారికి అభినందన పత్రము ఇవ్వబడును.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







