యువత ఉపాధి కోసం ఉద్యోగ శిక్షణలు: లేబర్ మినిస్ట్రీ

- December 20, 2022 , by Maagulf
యువత ఉపాధి కోసం ఉద్యోగ శిక్షణలు: లేబర్ మినిస్ట్రీ

మస్కట్: యువత ఉపాధి కోసం అనేక శిక్షణా కార్యక్రమాలకు ఉద్యోగ శిక్షణ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఒమన్  మినిస్ట్రీ ఆఫ్ లేబర్ (MoL) వెల్లడించింది. ఈ పథకం కింద, ఉద్యోగార్ధులకు ప్రైవేట్ రంగంలో చేరే ముందు శిక్షణ కోసం అర్హత కలిగిన సంస్థల్లో ఒకదానిలో మూడు నుండి 18 నెలల వరకు నిర్వహణ లేదా సాంకేతిక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొంది. శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఉద్యోగార్ధిని నేరుగా కంపెనీ మినిస్ట్రీ  పర్యవేక్షణలో నియమించుకుంటుందని కార్మిక మంత్రిత్వ శాఖలోని శిక్షణా సహాయ కేంద్రం ప్రతినిధి అలీ రషీద్ అల్ సాల్హి చెప్పారు. శిక్షణా కాలంలో ట్రైనీలకు నెలవారీ స్టైఫండ్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. శిక్షణ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ ధృవీకరణ పత్రాలను పొందవచ్చని, జాబ్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, అనుభవాలను పొందుతారని సాల్హి వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com