మంచు కొండల్లో శృతిహాసన్‌తో మెగాస్టార్ రొమాన్స్.! మైమరిపించేలా.!

- December 20, 2022 , by Maagulf
మంచు కొండల్లో శృతిహాసన్‌తో మెగాస్టార్ రొమాన్స్.! మైమరిపించేలా.!

‘ఎవడు’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో శృతి హాసన్ రొమాన్స్ కేక పుట్టించింది. అలాగే ‘గబ్బర్ సింగ్’ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్‌తోనూ శృతి హాసన్ స్వీట్ రొమాన్స్ పండించింది.
ఇక, ఇప్పుడు పెద్దన్న వంతొచ్చింది. ఆయనే మెగాస్టార్. ఎలా పట్టిందో కానీ, భలే ఛాన్స్ పట్టేసింది శృతి హాసన్. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో. అదేనండీ ‘వాల్తేర్ వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘నువ్వు శ్రీదేవి అయితే, నేనే చిరంజీవి’ అంటూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సాంగ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. 
ఇక సోమవారం ఫుల్ ఆడియో సాంగ్ వచ్చేసింది. లిరికల్ సాంగ్‌తో పాటూ అక్కడక్కడా చిరు, శృతి మధ్య జరిగిన రొమాంటిక్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి సరికొత్త రొమాంటిక్ థ్రిల్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పుడీ పాట నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యింది. చిరంజీవి, శృతిహాసన్ పెయిర్ సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com