మళ్లీ కరోనా పంజా..నేడు ప్రధాని మోడీ కీలక భేటీ
- December 22, 2022
న్యూఢిల్లీ: చెనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. బీఎఫ్-7 వేరియంట్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. మన దేశంలో సైతం ఈ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ… కొత్త వేరియంట్లపై ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. కోవిడ్ తాజా పరిస్థితులపై ఈరోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మోదీతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ, పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మాండవీయ నిన్ననే కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రధాని అధ్యక్షతన అత్యున్నత సమీక్ష జరగనుంది.
మరోవైపు దేశంలోకి కొత్త వేరియంట్లు వస్తుండటం, పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెప్పింది. చైనా సహా కరోనా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మాండవీయ తెలిపారు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒక్క కరోనా మరణం సంభవించింది. ప్రస్తుతం దేశంలో 3,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







