గాయపడిన కార్మికుడికి Dhs200,000 పరిహారం
- December 22, 2022
యూఏఈ: డ్యూటీలో గాయపడిన డ్రైవర్ కు పరిహారంగా Dhs 200,000 చెల్లించాలని ఓ కంపెనీని అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న విల్లాలో పని చేస్తున్న సమయంలో సదరు కార్మికుడు(డ్రైవర్) 3 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. డ్రైవర్ వాహనం ద్వారా కలపను తీసే క్రమంలో 3 మీటర్ల ఎత్తు నుండి నేలపై పడిపోయాడు. అతనిపై కలప పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నాక కంపెనీపై కార్మికుడు దావా వేశాడు. కోర్టు ఫీజులు, న్యాయవాది రుసుములతో పాటు తనకు జరిగిన భౌతిక, నైతిక, మానసిక నష్టానికి పరిహారంగా Dhs400,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. కార్మికుడి పరిస్థితిపై వైద్య నివేదికలో కార్మికుడికి ముక్కులో 10 శాతం శాశ్వత వైకల్యం, వెన్నెముక పనితీరులో 20 శాతం శాశ్వత వైకల్యం ఉందని పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించింది. అయితే డ్రైవర్ కంపెనీ కోసం పని చేస్తున్నాడని, తన అధీనంలో ఉన్నవారి బాధ్యత కంపెనీదేనని కోర్టు సూచించింది. అందువల్ల, అన్ని నష్టాలకు పరిహారంగా కార్మికుడికి Dhs 200,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







