మక్కాలో మోస్తరు నుండి భారీ వర్షాలు

- December 22, 2022 , by Maagulf
మక్కాలో మోస్తరు నుండి భారీ వర్షాలు

సౌదీ: మక్కా ప్రాంతంలోని చాలా గవర్నరేట్‌లు శుక్రవారం వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. జెడ్డాలో ప్రస్తుతం కుండపోత వర్షాలు పడుతున్నాయని, వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని NCM ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ సూచించారు. వర్షాలు పడే సమయంలో ఉపరితల గాలులు, ఎత్తైన అలలు, వడగళ్ళు, కుండపోత వర్షాలు, తక్కువ దృశ్యమానతతో వాతావరణం కూడి ఉంటుందని అల్-ఖహ్తానీ చెప్పారు. మక్కా నగరం, జెద్దా, రబీగ్, తైఫ్, జుముమ్, అల్-కమెల్, ఖులైస్, బహ్రా, అలైత్, కున్‌ఫుదా, అల్-అర్దియత్, అధమ్, సహా మక్కా ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com