మెడిసిన్ ఫీ ఎఫెక్ట్:అసుపత్రులలో 60 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- December 22, 2022
కువైట్: కొత్త మెడిసిన్ ఫీ కారణంగా ప్రభుత్వ క్లినిక్‌లు, ఆసుపత్రులను సందర్శించే ప్రవాసుల సంఖ్య 60 శాతం వరకు తగ్గిందని మెడికల్ రంగ నిపుణులు ఓ నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. ప్రవాసులకు సూచించిన మందులకు రుసుము వసూలు చేయాలనే నిర్ణయం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లో కొన్ని క్లినిక్‌లలో రోజుకు 1,200 మంది రోగులకు సేవలందించే సందర్శకుల సంఖ్య 400 కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 100 మంది వ్యక్తులు వైద్యం కోసం నమోదు చేసుకున్నా మందులు తీసుకోకుండా కేవలం పరీక్షలతో సరిపెట్టుకున్నారు. అయితే డయాబెటిస్ క్లినిక్‌లలో సందర్శకుల సంఖ్యలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రమాద విభాగాల్లోని సందర్శకుల సంఖ్య కూడా ప్రభావితం కాలేదని సదరు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







