ఖతీఫ్‌లో హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
- December 24, 2022
జెడ్డా: తూర్పు ప్రావిన్స్‌లోని ఖతీఫ్ గవర్నరేట్‌లో హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని అధికారులు తెలిపారు. ఖతీఫ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా వారి వాహనంతో ఒక వ్యక్తిపైకి దూసుకెళ్లి అతని వ్యక్తిగత వస్తువులను దొంగిలించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు నేరం చేసినట్లు ఒప్పుకున్నారని తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. "ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని చంపి, దోచుకోవడానికి ప్రయత్నించారని దర్యాప్తులో వెల్లడైంది. ఆపై వారిపై విచారణను పూర్తి చేయడానికి, సమర్థ కోర్టుకు వారిని రిఫర్ చేయడానికి సన్నాహకంగా వారిని అదుపులోకి తీసుకున్నారు" అని ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







