ఎమిరాటీల బోగస్ నియామకాలు.. ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ కు జైలు శిక్ష

- December 24, 2022 , by Maagulf
ఎమిరాటీల బోగస్ నియామకాలు.. ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ కు జైలు శిక్ష

యూఏఈ: 40 మందికి పైగా పౌరులకు ఉద్యోగాలు కల్పించినట్లు చూపుతూ అధికారులను తప్పుదోవ పట్టించిన ఒక ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్‌కు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జైలుశిక్ష విధించింది. మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ బోగస్ నియామకాలపై తక్షణమే విచారణ ప్రారంభించి యూఏఈ అటార్నీ-జనరల్‌ను అప్రమత్తం చేసిన తర్వాత ఈ మోసం బయటికొచ్చింది. డైరెక్టర్ తన కొంతమంది ఉద్యోగుల సహాయంతో కల్పిత పద్ధతిలో 40 మందికి పైగా ఎమిరాటీలను నియమించుకున్నారని నిర్ధారించారు. నఫీస్ లేదా ఎమిరేటైజేషన్ ప్రోగ్రామ్ నుండి ప్రయోజనాలు, ఆర్థిక సహాయాన్ని పొందే లక్ష్యంతో తన కంపెనీ పౌరులను నియమించుకున్నట్లు తప్పుగా పేర్కొంటూ నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాలను రూపొందించి, కల్పిత పని ఒప్పందాలను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నకిలీ ఎమిరేటైజేషన్‌ను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నఫీస్ స్కీమ్‌ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే కంపెనీల పై అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు, జరిమానాలు విధిస్తున్నది. నకిలీ ఎమిరేటైజేషన్ రుజువైతే ప్రతి ఎమిరాటీకి Dh100,000 వరకు జరిమానా విధించనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. యూఏఈ ఎమిరేటైజేషన్ నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతులను అనుసరించేలా బాధ్యత వహించాలని అటార్నీ జనరల్ ప్రైవేట్ రంగ సంస్థలలోని సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com