శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ మూడో సినిమా..
- April 27, 2016
వి జయవంతమైన కలయికకు ఉన్న క్రేజే వేరు. హిట్ కాంబినేషన్ అనిపించుకొన్న జోడీ మళ్లీ సినిమా తీస్తోంటే అందరి కళ్లూ అటువైపే ఉంటాయి. 'లక్ష్యం'తో మంచి విజయాన్ని అందుకొని, 'లౌక్యం'తోనూ ఆ పరంపర కొనసాగించారు గోపీచంద్, శ్రీవాస్. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో ప్రయత్నానికి తెర లేపారు. గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కథ ఇప్పటికే సిద్ధమైంది. 'లక్ష్యం', 'లౌక్యం'లా వినోదం, యాక్షన్ అంశాలకు కథలో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ''మా నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. వాటిని అందుకొనే కథ కుదిరింది. గోపీచంద్‌ని మరో కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా'' అన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







