భర్త పై దాడి.. మహిళకు పిల్లల కస్టడీని నిరాకరించిన కోర్టు
- December 25, 2022 
            బహ్రెయిన్: తన భర్తపై కత్తితో దాడి చేసిన కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళకు కోర్టులో చుక్కెదురైంది. భర్త దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. పిల్లల సంరక్షణను వదులుకోవాలని మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని సదరు వ్యక్తి షరియత్ కోర్టును ఆశ్రయించాడు. పిల్లల కస్టడీని పొందేందుకు తండ్రికి అర్హత ఉందని షరియా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నందున, కస్టడీ హక్కును వదులుకోవాలని కోర్టు మహిళకు సూచించింది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







