కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తులకు జైలుశిక్ష, జరిమానా

- December 25, 2022 , by Maagulf
కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తులకు జైలుశిక్ష, జరిమానా

దుబాయ్: కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసి అతని వాహనాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్షతోపాటు 760,000 దిర్హామ్‌ల జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడికి దుబాయ్‌లో లగ్జరీ కార్ల అమ్మకంలో ప్రత్యేకత కలిగిన కంపెనీ ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో లగ్జరీ కారు అమ్మకం ప్రకటన చూసి ఓ ఎమిరాటి పేరుతో నిందితులు తనను సంప్రదించినట్లు తెలిపారు. లగ్జరీ కారు ఫోటోలను నిందితులకు పంపిన తర్వాత కోనుగోలు ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కారును ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం కొనుగోలు చేస్తున్నానని నమ్మబలికారు. 761,920 దిర్హాలకు లగ్జరీ కారును కొనుగోలు చేసేందుకు నిందితులు అంగీకరించారని బాధితుడు తెలిపారు. కారు కొనుగోలు మొత్తాన్ని చెల్లించిక ముందే కారు ఓనర్ షిప్ ను తమ పేరుమీద బదిలీ చేయాలని కోరడంతో తాను వారి మాటలను నమ్మి అలాగే చేశానన్నారు. ఆ తర్వాత సదరు కారును మరో ఎమిరేట్‌లోని షోరూమ్‌లో కారును అమ్మకానికి ఉంచినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసును విచారించిన కోర్టు.. ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష,  761,920 దిర్హామ్‌ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com