దుబాయ్‌లో దొంగతనం.. ఐదుగురికి జైలు, జరిమానా
- December 26, 2022
దుబాయ్: దొంగనం ఆరోపణలపై అరెస్టయిన ఐదుగురు నిందితులకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలుశిక్ష, Dhs8,000 జరిమానా విధించింది. ఇందులో నలుగురు ఆఫ్రికన్లు ఉన్నారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత జూలైలో అల్ వాస్ల్లోని ఒక కేఫ్ మేనేజర్ తన కార్యాలయంలోని సేఫ్ నుండి 8,000 Dhs దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన ఉదయం, తన సేఫ్ నుండి డబ్బు దొంగిలించబడినట్లు గుర్తించానని, అది పగలగొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిటెక్టివ్‌ల బృందం కేఫ్‌లో పనిచేస్తున్న ముగ్గురు నిందితులే దొంగతనానికి పాల్పడ్డారని నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇతరుల సహకారంతో కేఫ్‌లోని డబ్బును దొంగిలించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్‌పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి







