కంటి నుంచి ఫిషింగ్ హుక్‌ను తొలగించిన వైద్యులు

- December 26, 2022 , by Maagulf
కంటి నుంచి ఫిషింగ్ హుక్‌ను తొలగించిన వైద్యులు

బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. బహ్రెయిన్ వ్యక్తి కుడి కన్నులోకి చొచ్చుకుపోయిన ఫిషింగ్ హుక్‌ను తొలగించడానికి అత్యవసర శస్త్రచికిత్సను చేపట్టారు. నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ హుస్సేన్ అల్-హర్మీ, అనస్థీషియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అమ్ర్ బహర్ నేతృత్వంలోని బృందం ఆధ్వర్యంలో వెంటనే అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. బృందం శస్త్రచికిత్స ద్వారా కంటి నుండి హుక్‌ను తొలగించి, అతడి దృష్టిని కాపాడటానికి దెబ్బతిన్న కణజాలాన్ని సరిదిద్దింది. ఇతర బృంద సభ్యులలో డాక్టర్ హసన్ అబ్దెల్-హడి, నేత్ర వైద్య విభాగం నుండి డాక్టర్ హవ్రా అల్-మహ్రూస్, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com