మూడేళ్లలో 77 మంది పిల్లలు చనిపోయారు: OHRC

- December 26, 2022 , by Maagulf
మూడేళ్లలో 77 మంది పిల్లలు చనిపోయారు: OHRC

మస్కట్: గత మూడేళ్లలో మానసిక వేధింపులు, పిల్లల పట్ల పేరెంట్స్ నిర్లక్ష్యం కారణంగా 77 మందికి పైగా పిల్లలు మరణించారని ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) వెల్లడించింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలో మహిళా వ్యవహారాలపై నిపుణురాలు, OHRCలో సమాచార కమిటీ అధిపతి లబీబా బింట్ మొహమ్మద్ అల్ మావ్లియా ఈ దురదృష్టకర సంఘటనలను ధృవీకరించారు. గత మూడు సంవత్సరాలలో ఎక్కువ మంది పిల్లలు, బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మరచిపోయి, లోయలు, ఈత కొలనులలో మునిగిపోవడం వల్ల మరణించారని పేర్కొన్నారు. పిల్లల మరణానికి కారణమైన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఒమానీ మహిళా సంఘం సహకారంతో కమిషన్ ఒమన్ అంతటా పిల్లల పట్ల నిర్లక్ష్యం, వేధింపులను తగ్గించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం ముసందం గవర్నరేట్‌లోని ఖాసబ్, బుఖా, దిబ్బ విలాయత్‌లలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com