జేఎన్టీయూలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- December 29, 2022
హైదరాబాద్: హైదరాబాద్ జేఎన్టీయూ లో విషాదం చోటుచేసుకుంది. జేఎన్టీయూ భవనం పైనుంచి దూకి నెల్లూరు జిల్లాకు చెందిన విదార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భార్య, కుమార్తె మేఘనారెడ్డి (21)తో కలిసి కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉంటున్నారు. మేఘన జేఎన్టీయూలో ఇంజినీరింగ్ (సీఈసీ) నాలుగో సంవత్సరం చదువుతోంది.
బుధువారం ఉదయం ఇంటర్నల్ పరీక్షలు రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు ఇంకా పావుగంట సమయం ఉందనగా క్యాంపస్ మైదానం పక్కనున్న నాలగంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేసింది. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒత్తిడి వల్లే మేఘన ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఏడాది కాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు వైస్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి తెలిపారు. మేఘనను ఆమె తల్లి ఆరు నెలలుగా కారులో తీసుకొచ్చి దింపి, తరగతులు ముగిసేంత వరకు అక్కడే ఉండి కుమార్తెను తీసుకెళ్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







