నకిలీ వీసాతో ప్రయాణం.. వ్యక్తికి జైలు శిక్ష

- December 29, 2022 , by Maagulf
నకిలీ వీసాతో ప్రయాణం.. వ్యక్తికి జైలు శిక్ష

దబాయ్: నకిలీ వీసాతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా జర్మనీకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు 29 ఏళ్ల అరబ్ వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఒక నెల జైలు శిక్ష,  బహిష్కరణ విధించింది. నకిలీ వీసా పొందేందుకు ఓ వ్యక్తికి 3,000 యూరోలు చెల్లించినట్లు నిందితుడు తెలిపాడు. పట్టుబడే వరకు వీసా నకిలీదని తనకు తెలియదని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడికి ఒక నెల జైలు శిక్ష విధించాలని, శిక్ష పూర్తి కాగానే దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com