‘కస్టడీ’లో వేస్తానంటోన్న నాగ చైతన్య!
- December 29, 2022
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో చైతూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కస్టడీ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కస్టడీ మూవీని ప్రపంచవ్యాప్తంగా మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో చైతూ పోలీస్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా.. ‘బంగార్రాజు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాలో ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో చైతూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!