చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబో మూవీ వుంటుంది కానీ.!
- December 29, 2022
‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయ్. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయ్. అందులోనిదే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబో మూవీ. మల్టీ స్టారర్ మూవీస్‌కి డిమాండ్ ఎక్కువగా వున్న తరుణంలో చిరు, పవన్ కలిస్తే, వచ్చే ఆ కిక్కే వేరప్పా.
ఆ కిక్కు కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కూడా అందుకు సిద్ధంగానే వున్నానంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు. కానీ, అందుకు పవన్ సిద్ధంగా లేడని చిరు తెలిపారు.
ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేశాకే ఈ కాంబో సెట్ అవుతుంది.. కానీ, తప్పకుండా ఆ కాంబో వుంటుంది అని చిరంజీవి తెలిపారు. ‘వీరయ్య’ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యి ధూమ్ ధామ్ చేస్తున్నాయ్. ఇక, మరో సాంగ్ మాస్ రాజాతో మాస్ మసాలా సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్టింగ్.!
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం