మెగాఫోన్ పట్టబోతున్న ముద్దుగుమ్మ.! త్వరలో దర్శకురాలిగా బాలయ్య హీరోయిన్.!
- December 30, 2022
వివాదాల హీరోయిన్‌గా రాధికా ఆప్టేకి పేరుంది.నటిగా ఆమె మంచి నటి. అందులో నో డౌట్. కానీ, నోరు కాస్త లూజ్. తాను నటించిన హీరోలపై జుగుప్సాకరమైన విమర్శలు చేస్తూ పలుమార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది రాధికా ఆప్టే.
ఆమె నోటి కారణంగానే సౌత్‌లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. బాలీవుడ్‌తో పాటూ, పలు ఇతర భాషల్లోనూ హీరోయిన్‌గా సినిమాలు చేసిన రాధికా ఆప్టే తాజాగా కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
తనకు యాక్టింగ్ అంటే అంతగా ఇష్టం లేదనీ, అనుకోకుండా యాక్టింగ్‌లోకి వచ్చాను కానీ, వాస్తవానికి డైరెక్టర్ అవ్వాలన్నదే తన కోరిక అని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోందట. ఆల్రెడీ సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాధికా ఆప్టే వర్క్ చేస్తోందట. త్వరలోనే తన దర్శకత్వంలో సినిమాలొస్తాయని రాధికా ధీమాగా చెబుతోంది.
డైరెక్టర్ అయినంత మాత్రాన నటించడం మానేస్తుందనుకుంటారేమో. నటిగా కొనసాగుతూనే, డైరెక్టర్‌గా తన ముచ్చట తీర్చుకుంటానంటోందీ కాంట్రవర్సీ భామ రాధికా ఆప్టే.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం