యూఏఈలో జనవరి 3న భారీ ఉల్కాపాతం
- December 31, 2022యూఏఈ: 2023 తొలి అరుదైన ఉల్కాపాతం చోటుచేసుకోనుంది. అద్భుతమైన జెమినిడ్స్ ఉల్కాపాతం తరువాత యూఏఈ నివాసితులకు జనవరి 3న క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేయనుంది. దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం.. రాబోయే ఉల్కాపాతం వీక్షించడానికి అవకాశం ఉన్నవాటిల్లో ఒకటి. గంటకు గరిష్టంగా 110 ఉల్కల రేటును ఇది చేరుకుంటుంది. క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం జనవరి 5 వరకు కొనసాగుతుంది. జనవరి 3-4 తేదీల్లో రాత్రి సమయాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ జనరల్ మేనేజర్ షీరాజ్ అహ్మద్ అవాన్ తెలిపారు. ఉల్కాపాతాన్ని ఆస్వాదించాలనుకునే ఆకాశ వీక్షకుల కోసం దుబాయ్ ఖగోళ శాస్త్ర సమూహం ఆ రోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉల్కలు అనేది సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో మన గ్రహం వాతావరణంలోకి ప్రవేశించే శిధిలాల ముక్కలు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం