ఇంగ్లాండలో ప్రతి శనివారం 'క్వైట్ అవర్'ను అమలు ..
- April 27, 2016
సూపర్ మార్కెట్లు రోజుకో ఆఫర్ ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. కస్టమర్లకు వినోదాన్ని పంచేందుకు డీజేలతో పాటు.. పలు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే.. అలాంటి భారీ శబ్ధాలు వచ్చే ప్రాంతాలకు ఆటిజం బాధితులు వెళ్లలేరు. కాస్తంత చప్పుడు చెవిలోపడినా భయపడిపోతుంటారు. అయితే.. అలాంటి వారికి సాదర స్వాగతం పలుకుతోంది ఇంగ్లాండలోని ఓ సూపర్‌మార్కెట్. ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ప్రత్యేకంగా 'క్వైట్ అవర్'(నిశ్శబ్ధ గంట)ను పాటించనున్నట్లు ప్రకటించింది.ఆటిజంతో బాధపడుతున్న ఓ యువకుడు ఇటీవల లండన్‌లోని 'ఆస్డా' సూపర్‌మార్కెట్‌కి వచ్చాడట. అయితే అందరిలా కాకుండా అతను భారీ శబ్ధాలకు భయపడుతుండటం స్టోర్ మేనేజర్ గమనించారట. అతని పరిస్థితిని గమనించిన మేనేజర్.. వెంటనే యాజమాన్యంతో పాటు.. సహోద్యోగులతో చర్చించి ఆటిజం బాధితులు కూడా సరదాగా షాపింగ్ చేసుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించాలని నిర్ణయించారు.ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి 9 వరకు 'క్వైట్ అవర్'ను అమలు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ సమయంలో గుండుపిన్ను వేసినా చప్పుడు వినిపించేంత ప్రశాంత వాతావరణం కల్పిస్తామని చెబుతున్నారు. అందుకోసం షాపింగ్‌మాల్‌లోని ఎస్కలేటర్లు ఆపేస్తారు.. మ్యూజిక్ సిస్టం సహా శబ్ధం వచ్చే అన్నింటినీ ఆపేస్తారు.మే 7 నుంచి 'క్వైట్ అవర్'ను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







