సౌదీలో 2.9 మిలియన్ల క్యాప్టాగాన్ మాత్రలు స్వాధీనం
- January 02, 2023
సౌదీ: సౌదీ అరేబియాకు వచ్చిన ఒక సరుకులో దాచిపెట్టిన 2.9 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ మాత్రలను గుర్తించిన తర్వాత వాటిని అక్రమంగా తరలించడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. మొదటి ప్రయత్నంలో ఖాళీ క్వార్టర్ పోర్ట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్ కన్సైన్‌మెంట్‌లో దాచిన 2,920,000 క్యాప్టాగన్ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. రెండో ప్రయత్నంలో హడిత పోర్టు గుండా వస్తున్న ఒక ట్రక్కులో స్పిండిల్‌లో దాచిన 24,400 క్యాప్టాగాన్ మాత్రలను గుర్తించి సీజ్ చేసినట్లు పేర్కొంది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్ సహకారంతో సీజింగ్ ఆపరేషన్‌లను పూర్తి చేసిన తర్వాత సౌదీ అరేబియాలో క్యాప్టాగన్ మాత్రలను స్వీకరించిన వ్యక్తిని విజయవంతంగా అరెస్టు చేసినట్లు అథారిటీ వెల్లడించింది. దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేయడాన్ని కొనసాగిస్తామని జాక్టా స్పష్టం చేసింది. స్మగ్లింగ్ నేరాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని భద్రతా నివేదికల కేంద్రం (1910) ద్వారా లేదా ఇ-మెయిల్: [email protected] అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా నివేదించాలని అథారిటీ పిలుపునిచ్చింది. అందజేసిన సమాచారం సరైనదైతే అందిచినవారికి ఆర్థిక రివార్డుతో పాటు, వారి సమాచారం పూర్తి రహస్యంగా పెడతామని తెలిపింది.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







