నేచురల్ స్టార్ నాని కొత్త అప్డేట్ అదిరిపోయిందిగా.!

- January 02, 2023 , by Maagulf
నేచురల్ స్టార్ నాని కొత్త అప్డేట్ అదిరిపోయిందిగా.!

వరుస సినిమాలతో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్నాడు. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత కొత్త సంవత్సరం కోసం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు నాని.
అందులో ఒకటి ‘దసరా’ సినిమా కాగా, 30 వ సినిమా కోసం ఓ ప్రయోగం చేయబోతున్నాడు నాని. ఆ ప్రయోగానికి సంబంధించిన అప్డేట్ న్యూ ఇయర్ డే సందర్భంగా రిలీజ్ చేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతోంది. 
ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన గ్లింప్స్ చాలా ప్లెజెంట్‌గా హార్ట్ టచ్చింగ్‌గా వుంది. ఓ ఎత్తైన భవనంపై తన కూతురితో కూర్చొని ఫోటోలు క్లిక్ చేస్తుంటాడు నాని. ఆ సందర్భంలో ‘నీకు గెడ్డం బాగా లేదు నాన్నా.! అని కూతురు అంటుంటే, ఇదంతా ‘దసరా సినిమా కోసం తల్లీ.! తీసేస్తాను.. మన సినిమాలో గెడ్డం, మీసం వుండదు.. అని హింట్ ఇచ్చాడు.
అదే కాన్సెప్ట్‌లో తన కొత్త సినిమా హీరోయిన్, టెక్నీషియన్స్ గురించి పరిచయం చేశాడు. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తుండగా, శౌర్యూన్ అను కొత్త కుర్రోడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అంతా కొత్తవాళ్లే. చాలా విభిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు ఫస్ట్ గ్లింప్స్‌తో నాని పెద్ద హింట్ ఇచ్చేశాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com