కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.! వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- January 02, 2023
‘బింబిసార’ అంటూ ఓ సరికొత్త ప్రయోగంతో 2022 లో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ కొట్టాడు సింపుల్‌గా కళ్యాణ్ రామ్. ఇప్పుడు అదే జోష్‌లో మరో కొత్త ప్రయోగానికి నాంది చుట్టాడు.
‘అమిగోస్’ అంటూ కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ మొన్నా మధ్య సెన్సేషన్ అయ్యిన సంగతి తెలిసిందే. అమిగోస్ అంటే ఏంటీ.? అంటూ సెర్చింగుల మీద సెర్చింగులు చేసేశారు సినీ జనం.
టైటిల్‌తో పాటూ, కొన్ని ఇంట్రెస్టింగ్ పదాలను కూడా వదిలారప్పుడు. ఇప్పుడు ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తూ మరో పోస్టర్ వదిలారు.
‘డోపెల్‌గ్యాంగర్ 1 సిద్దార్ధ్’ అనేది కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పేరు. ఇందులో ‘డోపెల్ గ్యాంగ్ అంటే ఏంటీ.? అనేది కొత్త ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ‘వాడిలా కనిపించే ఇంకొకడు’ అని అర్ధమట. అంటే ఇద్దరున్నారా.? ఈ సినిమాలో. ‘1’ సిద్దార్ధ్ అయితే, మరి ఆ ‘2’ ఎవరు.? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే రివీల్ కానుందట.
ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘అమిగోస్’ భలే ఇంట్రెస్టింగ్ యా.!
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







