దుబాయ లో కొత్త అగ్నిమాపక భద్రత చర్యలలో ఆక్సిజన్ కనెక్షన్
- April 28, 2016
విద్యుత్, నీటి కనెక్షన్ మాదిరిగానే ఆక్సిజన్ ను ఇక అగ్ని మాపక దళం ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అగ్ని చుట్టిముట్టినపుడు అగ్నిమాపకదళ సిబ్బంది ఈ ఆక్సిజన్ వ్యవస్థనుసమర్ధవంతంగాఉపయోగించుకొంటారు. ఆకాశహర్మ్యాలలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏర్పడిన ఒక పౌర రక్షణ సమితి ఎమిరేట్ లో ఉన్న భవనాలలో అగ్నిభద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.అంతేకాక ఒక పటిష్టమైన ఆధునాతన అలారం వ్యవస్థ మరియు ప్రతి భవనం కోసం ఆక్సిజన్ కనెక్షన్ తీసుకోవాలని ప్రధాన సిఫార్సులు చేశారు .దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ రషీద్ థానీ అల్ మత్రౌషి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం ఏర్పాటయిన ప్రామాణిక కమిటీ దుబాయ్ కొత్త భవనాల ప్రత్యేకతలు మార్పులు చేయడానికి క్రొత్త సిఫార్సు జారీ చేసినట్లు చెప్పారు.ఈ బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తాపడం కోసం ఉపయోగించిన పదార్థం అగ్నివ్యాప్తిని నిరోధించడానికి మరియు మంటలను అదుపులోనికి తేవటానికి నుండి ఒక సమగ్ర పరిష్కారం సూచించారు.ఈ సిఫార్సులను 6 వ వార్షిక అగ్నిభద్రత సాంకేతిక ఫోరంను ఉప ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి. లెఫ్టినెంట్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. అల్ మత్రౌషి పేర్కొంటూ యుఎఇ లో ఉన్న భవనాలు సంఖ్య పరిగణనలోకి తీసుకొంటే, ఇక్కడ జరిగే అగ్ని సంఘటనలు అత్యల్పమని ఆయన అన్నారు.ప్యానెల్ సిఫారసులలో స్మార్ట్ అలారం వ్యవస్థ అమలు ప్రారంభమౌతుంది, దుబాయ్ సివిల్ డిఫెన్స్, దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ విద్యుచ్ఛక్తి మరియు వాటర్ అథారిటీ మరియు దుబాయ్ పోలీస్ మరియు అంబులెన్స్ ఈ విభాగాలు రాబోయే సమావేశాలలో భాగంగా ఉంటుందని తెలిపారు. అల్ మత్రౌషి మాట్లాడుతూ సివిల్ డిఫెన్స్ ఇప్పటికే షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రాం అధీనంలోని నిర్మించుకున్న ఇళ్లలో ఉపయోగించే ఈ పరికరం కోసం1,950 దినార్ల ఖర్చవుతుందని నెలకు 40 దినార్ల నిర్వాహణ బిల్లు వస్తుందని ఇప్పటివరకు 220 భవనాలపై ఈ పరికరం అమర్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







