స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన టిఎస్ ఆర్టీసీ
- January 04, 2023
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ ప్రయాణికుల కోసం స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు నుండి 10 స్లీపర్ బస్సులను అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ మధ్య పరుగులు పెట్టనున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్ స్టాప్ వద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభిస్తారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరిగి కాకినాడలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







