కారు బాంబు పేలుడులో తొమ్మిది మంది మృతి
- January 04, 2023
మోగాదిషు: సెంట్రల్ సోమాలియాలోని మహాస్ పట్టణ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుడు పదార్థాలు నింపిన వాహనాలతో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక భద్రతా అధికారి అబ్దుల్లాహి అదాన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడ్డారని అన్నారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించినట్లు గుర్తించామని అన్నారు.ఈ దాడికి ఉగ్రవాద సంస్థ అల్–షబాబ్కు చెందిన జిహాదీ యోధులుగా తెలుస్తోంది.
మహస్ లోని జిల్లా పరిపాలనా భవనానికి సమీపంలో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు మహాస్ లోని పోలీస్ కమాండర్ ఉస్మాన్ నూర్ అన్నారు.ఈ దాడిలో మృతులంతా అమాయక పౌరులేనని తెలిపారు. ఉగ్రవాదులు పౌరులను భయపెట్టడానికి పేలుళ్లకు పాల్పడ్డారని, అయితే ఇలాంటి ఘటనలతో ప్రజలను బయపెట్టలేరని అన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







